Venkatesh1

Apr 16 2024, 06:33

ప్రగతి కోసం "పల్లె నిద్ర"... ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు..

గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలను గుర్తించి గ్రామాభివృద్ధికి చేపట్టవల్సిన అంశాలపై చర్చించి పల్లెల్లో ప్రగతి సాధించేందుకు "పల్లె నిద్ర" చేపడుతున్నట్లు శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

రోజంతా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ నిత్యం జనాల్లో ఉంటూ ప్రజాదరణ పొందుతున్నారు. అలాగే నాయకులు కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహాన్ని పెంచుతూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు.

గార్లదిన్నె మండలం బుదేడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. 

గ్రామాల్లో ప్రజలతో కూర్చోని గ్రామాభివృద్ధిపై ప్రజలతో చర్చించి ఇంకా గ్రామాభివృద్ధి కోసం చేపట్టవల్సిన పనులపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విదంగా గ్రామాభివృద్ధి చేసేందుకు "పల్లె నిద్ర" కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో బస చేశారు.

Venkatesh1

Apr 16 2024, 06:22

ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి* గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ప్రచారం..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేసేపల్లి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి వారిపై కేసులు పెట్టి వేధించారని సుమారు 3500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఏపీకి 12 లక్షల అప్పు భారం ప్రజలపై పెట్టిన ముఖ్యమంత్రి అది జగన్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగలేదు రోడ్లు వేయలేదు నీళ్లు తీసుకురాలేదు పోలవరం కట్టలేదు మరి ఎందుకు అప్పులు పెరిగాయి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక గా జగన్ మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక మద్యం కరెంటు చెత్త పన్ను ఆస్తిపన్ను ప్రజలపై భారం వేసి కోట్లాది రూపాయలు వేశారని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే అన్నారు.

జగన్ రెడ్డి చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంతం చిన్నాన్న చంపిన వ్యక్తులను దగ్గర పెట్టుకొని రక్షిస్తున్నాడని అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 16 2024, 06:14

నిరుపేదలకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించండి..ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నిరుపేదలకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించండి 

 ◆ మీ బిడ్డగా ఆశీర్వదించండి..సేవకుడిగా పని చేస్తా

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ సంక్షేమాన్ని అడ్డుకుంటున్న కూటమి

◆ ప్రజలకు మంచి చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు.

నిరుపేదకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించి, కష్టం విలువ తెలిసిన నిరుపేద అయిన తనను రానున్న ఎన్నికలలో ఆశీర్వదించి గెలిపించాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కోటంక, బూదేడు, సంజీవపురం, కృష్ణాపురం గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని అడుగడుగునా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని శింగనమల వీరాంజనేయులు అన్నారు.

ముందుగా గుంటికింద సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఫాదర్ ఫెర్రర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికీ వెళ్లి జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కరపత్రాలను ఓటర్లను అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని అడుగడుగునా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జరిగిన మేలుని ప్రజలు మర్చిపోలేదన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసిన సంక్షేమాన్ని ధైర్యంగా టిడిపి వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలతో పొంతనలేని హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. పొత్తులతో వస్తున్న టీడీపీ కూటమిని ప్రజలు నమ్మరన్నారు. 

ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలలో భాగంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందించిన జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిగా పట్టం కట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 15 2024, 07:22

రోడ్ షో మరియు బహిరంగ సభ కార్యక్రమంలో నందమూరి నటసింహ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తో పాటు పాల్గొన్న కే రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు సంజీవరెడ్డి సర్కిల్ లో జరిగిన రోడ్ షో మరియు బహిరంగ సభ కార్యక్రమంలో నందమూరి నటసింహ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సింగమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారుశ్రావణి శ్రీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధిఆలం నరసానాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కే రామలింగారెడ్డి తదితరులు

Venkatesh1

Apr 15 2024, 07:11

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి..

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శిoగనమల నియోజకవర్గ మండల కేంద్రంలో నియోజకవర్గ టీడీపీ,జనసేన, బిజెపి పార్టీ ల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు,ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బండారు శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని బడుగు బలహీన వర్గాలు ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారంటే ఆయన చలవే అని వారు తెలియజేశారు.

ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు అని అన్నారు.న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయ వేత్తగా,సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా,ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ బి అర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులందరూ పాల్గొన్నారు

Venkatesh1

Apr 15 2024, 06:59

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ

◆ దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక, టీడీపీ ఓటమి భయంతో దాడికి పాల్పడటం పిరికిపంద చర్య అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం.శంకర్ నారాయణ విమర్శించారు.

బుక్కరాయసముద్రం మండలం బొమ్మలపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో వీరాంజనేయులు, శంకర్ నారాయణ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో ప్రతిపక్షాలు ఓటమి భయంతో ఈ ఘాతుకానికి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన ఈ దాడి ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రగా భావిస్తున్నామన్నారు. టిడిపి జనసేన ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని, టిడిపిని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 15 2024, 06:47

దేశానికి మార్గదర్శి బీఆర్ అంబేడ్కర్.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు...

దేశానికి మార్గదర్శి బీఆర్ అంబేడ్కర్.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన క్రాంతిమూర్తి, భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 133 వ జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, దళిత నాయకులు, పార్టీ శ్రేణుల తో కలసి ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్న సామాజిక సమానత్వ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలన సాగిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా నియమించి సామాజిక విప్లవానికి నాంది పలికిన ఏకైక సీఎం జగనన్న అని అన్నారు.

Venkatesh1

Apr 14 2024, 07:14

పోతురాజు కాలువ లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక..

పోతురాజు కాలువ లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక..

సింగనమల మండలం పోతురాజు కాలువ గ్రామంలో సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణ శ్రీ మరియు ద్వి సభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి నియోజకవర్గ అబ్జర్వర్ గుర్రప్ప నాయుడు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది 

ఈ సందర్భంగా బండారు శ్రావణ శ్రీ గారు మాట్లాడుతూ పార్టీలో మీకు సముచిత న్యాయం చేస్తామని పార్టీ కోసం కష్టపడాలని తెలుగుదేశం పార్టీలోకి చేరిన కార్యకర్తలకు నాయకులకు తెలియజేయడం జరిగింది*

Venkatesh1

Apr 14 2024, 07:07

వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా

వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటా సంక్షేమాభివృద్ధి జరిగిందని, ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు కోరారు.

పుట్లూరు మండలం మడ్డిపల్లి, నారాయణరెడ్డిపల్లి, సూరేపల్లి, గొల్లపల్లి, అరకటవేముల, కొండాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.

గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జగనన్న చేసిన ఐదేళ్ల పాలనలో అందిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు గుర్తు చేశారు. "ఫ్యాన్ " గుర్తు కు ఓటు వేసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గెలిపిస్తే మీ అందరి సేవకుడిగా పనిచేస్తూ, అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. టీడీపీ వారు నెరవేర్చలేని అబద్ధపు హామీలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. జగనన్న ఐదేళ్లలో చేసిన సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ఫలానా చేసామని చెప్పుకుంటున్నామని, టిడిపి పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మేలునైనా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.  

మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి "ఫ్యాన్" ప్రభంజనం ఖాయమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి జగనన్న పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 14 2024, 06:54

విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి.. దాడిని ఖండించిన శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి.. టీడీపీ పిరికిపంద చర్య..

శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని శింగనమల వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ఖండించారు.

మేమంతా సిద్ధం యాత్రలో జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేని తెలుగుదేశం నాయకులు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

పేదల పక్షాన నిలబడిన మా నాయకుడిపై తెలుగుదేశం పార్టీ పెత్తందారుల దాడిగా అభివర్ణించారు.

జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అందదండలు, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు అయన ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.